పంద్రాగస్టుకు ప్రీ ప్రైమరీ పాఠశాలల ప్రారంభం

SRD: జిల్లాకు మంజూరైన 58 ప్రీ ప్రైమరీ పాఠశాలను పంద్రాగస్టుకు ప్రారంభించేలా ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటనలో తెలిపారు. ప్రీ ప్రైమరీ మంజూరైన పాఠశాలల్లో ఏర్పాటు చేసేందుకు ఎంఈవోలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీపంలోని విద్యార్థులను పాఠశాలలో చేర్పించేలా చూడాలని సూచించారు.