ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వ ఆదాయానికి గండి
నిర్మల్: ఆర్టీసీ సమస్యలపై ప్రభుత్వ చర్చలు విఫలం కావడంతో కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. హామీల అమలు కోసం నిర్మల్ డిపోలోని 480 మంది సిబ్బంది విధులకు దూరంగా ఉండనున్నారు. 154 బస్సులు నిలిచిపోనుండటంతో సుమారు రోజుకు రూ. 38 లక్షల ఆదాయానికి గండి పడనుంది.