కుష్టు వ్యాధి నిర్మూలన‌పై అవగాహన

కుష్టు వ్యాధి నిర్మూలన‌పై అవగాహన

CTR: కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పుంగనూరు అర్బన్ PHC డాక్టర్ కిరణ్మయి కోరారు. శుక్రవారం పట్టణంలోని కొత్తపేట ప్రాంతంలో వైద్య సిబ్బంది కుష్టు వ్యాధి యొక్క లక్షణాలు, నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 13వ తేదీ వరకు జరుగుతుందని ఆమె తెలిపారు. ఎవరికైనా స్పర్శలేని మచ్చలు ఉంటే సిబ్బందికి తెలియచేయాలన్నారు.