నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
VSP: పీఎం పాలెం పరిధిలో నిర్వహణ పనుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విశాఖ ఆపరేషన్ జోన్-3 ఈఈ బి. సింహాచలం నాయుడు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గాయత్రీనగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, తులసీనగర్ పార్కు, పాత పంచాయతీ ఆఫీస్, ఆర్‌కే నగర్, ఎఫ్‌సీఐ లేఅవుట్, లక్ష్మీవానిపాలెంలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులందరూ సహకరించాలని కోరారు.