మెరుగుపడుతున్న ఇండిగో విమాన సేవలు

మెరుగుపడుతున్న ఇండిగో విమాన సేవలు

ఇండిగో విమాన సేవలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, గోవా విమానాశ్రయాల్లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. బోర్డింగ్ పాయింట్ల వద్ద ప్రయాణికుల రద్దీ తగ్గింది. ఇప్పటికే వెబ్‌సైట్‌లో షెడ్యూల్‌ను అప్‌డేట్ చేసి, అన్ని విమానాలు క్రమంగా నడుస్తున్నాయని సంస్థ వెల్లడించింది.