ప్రశాంత ఎన్నికలకు చర్యలు

ప్రశాంత ఎన్నికలకు చర్యలు

విశాఖ: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు నర్సీపట్నం రూరల్ సిఐ హరి తెలిపారు. మాకవరపాలెం పోలీస్ స్టేషన్‌ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించామన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలను గుర్తించి, ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు.