35 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి
AKP: కసింకోట మండలంలో సోమవారం ఉదయం 8 గంటల వరకు 35 శాతం పింఛన్లను పంపిణీ చేసినట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం ఏడు గంటల నుంచి పించన్ల పంపిణీ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మండలంలో మొత్తం 10,208 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. సుందరయ్య పేట గ్రామపంచాయతీ జి. భీమవరంలో తను ఇంటింటికి వెళ్లి పింఛన్లను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు.