మహిళల జట్టు విజయం అభినందనీయం: లోకేష్

మహిళల జట్టు విజయం అభినందనీయం: లోకేష్

AP: మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై భారత జట్టు విజయం సాధించడం అభినందనీయమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. జెమీమా రోడ్రిగ్స్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు విజయాన్ని అందించారని, హర్మన్‌ప్రీత్ కౌర్ ఆత్మవిశ్వాసంతో 89 పరుగులు చేసి కీలక భాగస్వామ్యం అందించారని చెప్పారు. ఒత్తిడిలో భారత మహిళా జట్టు ధైర్యంగా ఆడటం గర్వంగా ఉందన్నారు.