రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

AP: ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన CP రాధాకృష్ణన్‌కు CM చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. మీ పదవీకాలం విజయవంతంగా పూర్తి చేయాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. దేశ సేవకు పురోగతికి రాధాకృష్ణన్ పనిచేస్తారని భావిస్తున్నానన్నారు. ఆయన అపార జ్ఞానం, అనుభవం ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తాయని అన్నారు. అలాగే Dy.CM పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్.. రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.