VIDEO: ఆర్టీసీ కార్మికుల సమ్మె.. డిపోల వద్ద భారీ బందోబస్తు

VIDEO: ఆర్టీసీ కార్మికుల సమ్మె.. డిపోల వద్ద భారీ బందోబస్తు

KNR: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్ మోగింది. అర్ధరాత్రి నుంచే బస్సులు డిపోలకే పరిమితం కావడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. హుజూరాబాద్‌లో కార్మికులు డిపోల ఎదుట బైఠాయించి, తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ నినదించారు. సమస్యలు తీరే వరకు విధులకు హాజరయ్యేది లేదని స్పష్టం చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు డిపోల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.