ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం
MDK: హవేలీ ఘన్‌పూర్ మండలంలోని రైతు వేదికలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయంపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. సేంద్రీయ వ్యవసాయ పద్ధతి ద్వారా రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు.