అనాథలకు సేవ చేయాలి

NLG: అనాథలకు సేవ చేసే మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సినీనటుడు బాబుమోహన్ అన్నారు. చౌటుప్పల్ లోని అమ్మానాన్న అనాథాశ్రమాన్ని ఆయన సందర్శించారు. తన కుమారుడు పవన్ జ్ఞాపకార్థం పవన్ బాబుమోహన్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్య, వైద్యం, ఆర్థిక సాయం అందించనున్నారు. అందులో భాగంగా మంగళవారం ఇక్కడకు వచ్చారు.