మత విద్వేషాలు రెచ్చగొడుతున్నవారిపై చర్యలకు డిమాండ్
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా, డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడులు, విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. వర్సిటీలో ఐడీ కార్డు నిబంధనలు ఉన్నప్పటికీ బయటి వ్యక్తులు లోనికి రావడంపై ప్రశ్నించారు.