అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం
NLR: కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ అధికారులతో ఎమ్మెల్యే నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ హిమవంశీతో శాఖల నిధులు, పెండింగ్ పనులు, ప్రజా ఫిర్యాదులపై చర్చించారు. ఆయన ఆసుపత్రులు, పారిశుద్ధ్యం, రహదారులు, పాఠశాలల పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. అధికారులు బాధ్యతగా పనిచేయాలని, నిధులను సక్రమంగా వినియోగించాలన్నారు.