ఘనంగా విజయదుర్గమ్మ సన్నిధిలో రాహుకేతు పూజలు
కడపలోని విజయదుర్గమ్మ ఆలయంలో రాహుకాల పూజలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. రాహుకాల సమయంలో దీపాలు వెలిగించి నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని విశ్వాసంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. 11, 21, 41 వారాలుగా ఈ పూజలు నిర్వహిస్తే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. మంగళవారం పంచామృత అభిషేకంతో పాటు నిత్యపూజలు నిర్వహించారు.