'81,238 భక్తులు చందనోత్సవ దర్శనాలు'
VSP: సింహాచలంలో స్వామి నిజరూప దర్శనం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు 81,238 మంది స్వామిని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే 6గంటల తరువాత భక్తులకు కొండ పైకి అనుమతించడం లేదని ఆలయ అధికారులు పేర్కొన్నారు.