రేపటి నుంచి సుబ్రహ్మణ్యేశ్వరుడి పట్టు పవిత్రోత్సవాలు

రేపటి నుంచి సుబ్రహ్మణ్యేశ్వరుడి పట్టు పవిత్రోత్సవాలు

కృష్ణా: మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయంలో ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు పవిత్రోత్సవ సహిత ఆషాఢ కృత్తిక (ఆడికృత్తిక) మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ EO శ్రీరామవర ప్రసాదరావు తెలిపారు. జూలై 17 నుంచి 19వ తేదీ వరకు పట్టు పవిత్రోత్సవాలు, 20వ తేదీ స్వామివారి జన్మనక్షత్రం ఆషాఢ ఆడికృత్తికగా జరుగుతుందన్నారు.