ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజా బాబు

ప్రకాశం: రాష్ట్రవ్యాప్తంగా 12 మంది జిల్లా కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజా బాబును నియమించింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.