VIDEO: అధిక వడ్డీ వద్ద మానీ లెండర్లపై రైతుల ఆవేదన
JN: స్టేషన్ ఘనపూర్ పట్టణంలో పంట సాగు కోసం బంగారం కుదువ పెట్టి రుణం తీసుకున్న గద్ద కుమార్ ఆదివారం గణేష్ జ్యువెలర్స్ షాప్ ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. కుదువ పెట్టిన బంగారం ఇవ్వమని అడిగినా, షాప్ యజమాని అధిక వడ్డీ చెల్లిస్తేనే ఇవ్వనున్నట్టు వ్యవహరిస్తున్నాడని రైతు తెలిపారు. మానీ లెండర్ల విధానంపై ఆయన నిరసన ప్రకటించారు.