చించినాడ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా బంద్

చించినాడ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా బంద్

W.G: యలమంచిలి మండలం చించినాడ వంతెనపై బుధవారం అర్ధరాత్రి నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు మల్కీపురం ఎస్సై సురేశ్ తెలిపారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి గురువారం ఉదయం 5 గంటల వరకు అన్నిరకాల వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నామన్నారు. వంతెనపై జరుగుతున్న అత్యవసర మరమ్మతు పనుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.