భారత్ నుంచి దిగుమతులు పెంచుకుంటాం: రష్యా
మరో రెండు రోజుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడి అధికార ప్రతినిధి పెస్కోవ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. అలాగే చమురుపై భారత్‌కు మరిన్ని ఆఫర్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. తమ మిత్ర దేశం నుంచి దిగుమతులను పెంచుకుంటామని తెలిపారు.