‘నేటి నుంచి స్పెషల్ అధికారుల పాలన’
NDL: సర్పంచ్ పదవీ కాలం ముగియడంతో బేతంచెర్ల మండలంలో నేటి నుంచి స్పెషల్ అధికారుల పాలన అమల్లోకి రానునట్లు ఎంపీడీవో ఫజుల్ రహిమాన్ తెలిపారు. మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు ఎంపీడీవో, ఉప ఎంపీడీవో వై.పరమేశ్వరరెడ్డి, ఎంఈవో సోమశేకర్, వ్యవసాయ అధికారి విజయ్ కుమార్ రెడ్డి, ఏవో ఇదృష్ బాషా, ఈవోఆర్డీ మల్లిఖార్జునలను స్పెషల్ అధికారులుగా నియమించారు.