కనకమహాలక్ష్మి అమ్మవారి ఉత్సవ కమిటీ ఏర్పాటు

కనకమహాలక్ష్మి అమ్మవారి ఉత్సవ కమిటీ ఏర్పాటు

VSP: విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వం ఉత్సవ కమిటీని నియమించింది. ఉత్సవాలు జరిగే రోజుల్లో భక్తులకు సేవలు అందించేందుకు సోమవారం ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.