జాగృతిలో చేరిన మద్దూరు మండలం యువకులు
NRPT: మద్దూరు మండలం పరిధిలోని పలు గ్రామాలకు చెందిన యువకులు బుధవారం కల్వకుంట్ల కవిత నివాసంలో ఆమెను కలిశారు. అనంతరం వారు ఆమె స్థాపించిన తెలంగాణ జాగృతి పార్టీలో చేరారు. పార్టీ పెట్టడం వల్లే తాము జాగృతిలో చేరామని మద్దూరు మండలానికి చెందిన చిరంజీవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాము, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.