VIDEO: రాయదుర్గంలో ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్
ATP: రాయదుర్గం మండలం చదం గొల్లలదొడ్డి పరిసరాలలో పోలీసులు డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు. ఈ ఆధునిక సాంకేతికత ద్వారా పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను సీఐ జయనాయక్ ఆధ్వర్యంలో గుర్తించి అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 15,050 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు రాయదుర్గం పోలీసులు కృషి చేస్తున్నారు.