వనపర్తిలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

వనపర్తిలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

WNP: జిల్లా పోలీస్ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. డీసీఆర్‌బీ డీఎస్పీ బాలాజీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ రక్షణ మంత్రిగా, ఉప ప్రధానిగా అణగారిన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా డీఎస్పీ కొనియాడారు.