పవర్ బోర్ల వినియోగంలో ఆంక్షలు..!
MNCL: చెన్నూర్ మున్సిపాలిటీలోని వార్డులలో పవర్ బోర్లను ఇష్టానుసారంగా వాడకుండా ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు మాత్రమే వినియోగించుకోవాలని కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. వేసవికాలంలో దృష్టిలో ఉంచుకొని నిరంతరాయంగా పవర్ బోర్లను వాడటం వలన కాలిపోయే అవకాశం ఉందన్నారు. భూగర్భ జలాలు ఇంకిపోయే ప్రమాదం ఉండటంతో సమయానుకూలంగా వినియోగించుకోవాలని సూచించారు.