స్టేషన్ ఘనపూర్‌లో సమ్మర్ క్యాంప్ ప్రారంభం

స్టేషన్ ఘనపూర్‌లో సమ్మర్ క్యాంప్ ప్రారంభం

JN: స్టేషన్ ఘనపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో సావ్ లీన్ కుంగ్-ఫు ఆధ్వర్యంలో కరాటే సమ్మర్ క్యాంప్‌ను బుధవారం ప్రారంభించారు. ముఖ్య అతిథి సీఐ వేణు హాజరై మాట్లాడుతూ.. కరాటే శారీరక, మానసిక దృఢత్వానికి తోడ్పడతుందన్నారు. పదో తరగతిలో 570 మార్కులతో జిల్లాలో రెండో ర్యాంకు సాధించిన కడమంచి అక్షరను శాలువాతో సన్మానించి రూ.5 వేలు అందజేశారు.