'పట్టా భూమిని పెత్తందారులు కబ్జా చేస్తున్నారు'

'పట్టా భూమిని పెత్తందారులు కబ్జా చేస్తున్నారు'

ATP: పుట్టపర్తి మండలం గువ్వలగుట్లపల్లి వాసులు గ్రామానికి సంబంధించిన పట్టా భూమిని పెత్తందారులు రాత్రికి రాత్రే చదును చేసి కబ్జా చేస్తున్నారన్నారు. నిరుపేదలైన గ్రామస్తులకు అందులో స్థలాలు ఇవ్వాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ కు విన్నవించుకున్నట్లు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి ఈ విషయంపై తగిన ప్రతిపాదనలు చేయాలని వారు పేర్కొన్నారు.