రాఘవ్ చద్దా పవర్‌ఫుల్ మెసేజ్
తనపై ఆంక్షలు విధిస్తున్న వారికి MP రాఘవ్ చద్దా పవర్‌ఫుల్ మెసేజ్ ఇచ్చారు. 'నా మౌనాన్ని నా ఓటమిగా భావించవద్దు.. నేను సమయం వచ్చినప్పుడు ఉప్పెనలా మారే నదిని' అంటూ హెచ్చరించారు. తన హక్కులను కాలరాసినా, ప్రజల మద్దతు తనకు ఉందని.. వారి కోసమే తన జీవితమని పేర్కొన్నారు. ఇప్పటివరకు తనకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనపై జరుగుతున్న కుట్రలను ప్రజలే గమనించాలని కోరారు.