భార్యాభర్తలు సర్పంచ్, ఉపసర్పంచ్

భార్యాభర్తలు సర్పంచ్, ఉపసర్పంచ్

NGKL: వెంకటాపురం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి శనివారం ఉపసంహరణ ముగియడంతో గ్రామం ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. గ్రామంలో సర్పంచ్‌గా శకుంతలమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, ఆమె భర్త వార్డు సభ్యుడిగా ఏకగ్రీవమై, ఆపై ఉపసర్పంచ్‌గా ఎన్నిక కావడం విశేషం. ఇకపై ఈ భార్యా భర్తలు పదవుల్లో కొనసాగనున్నారు.