కంట్రోల్ రూమే పోలీసులకు ప్రాణం: ఎస్పీ
SRPT: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కంట్రోల్ రూమ్ అత్యంత కీలకమని ఎస్పీ నరసింహ అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఈరోజు తనిఖీ చేసిన ఆయన, డయల్ 100 ఫిర్యాదులపై సిబ్బంది మెరుపు వేగంతో స్పందించాలని ఆదేశించారు. నిరంతర నిఘాతో నేరాలను అరికట్టి బాధితులకు భరోసా కల్పించాలని సూచించారు. వేగవంతమైన సేవలతో జిల్లాకు మంచి గుర్తింపు తేవాలన్నారు.