యుద్ధం ప్రభావం.. ఆకాశాన్నంటిన సిమెంట్ ఇసుక ధరలు
KMM: ఉమ్మడి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై గల్ఫ్ యుద్ధ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. మొదటి విడతలో మంజూరైన 30వేల ఇళ్లకు ప్రభుత్వం ఇచ్చే రూ. 5 లక్షల బడ్జెట్ ఏమాత్రం సరిపోవడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం కారణంగా సిమెంట్, ఐరన్, ఇసుక, ఇటుక ధరలు కొండెక్కి కూర్చున్నాయి. పెరిగిన ధరల భారంతో నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోతున్నాయి.