'పిల్లలను అంగన్వాడీలో చేర్చాలి'
JGL: 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ హేమలత, సర్పంచ్ విజయ అన్నారు. మెట్పల్లి మండలం ఆత్మనగర్ అంగన్వాడీ కేంద్రాలలో సోమవారం పోషణ పక్షం, గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు నేర్చుకున్న అంశాలను తల్లిదండ్రుల ముందు ప్రదర్శింపజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ యమున, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.