నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
BPT: అద్దంకిలో నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు పనుల దృష్ట్యా బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఈఈ మస్తాన్ రావు తెలిపారు. విశ్వభారతి స్కూలు, న్యూ స్టేట్ బ్యాంక్ కాలనీ, ఆయిల్ మిల్ రోడ్డు, అభ్యుదయ నగర్, నంబూరి వారిపాలెం, బ్రహ్మానందం కాలనీ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు.