VIDEO: రిటైర్డ్ ఏఎస్ఐని ఢీకొట్టిన డీసీఎం
SRPT: సూర్యాపేట మండలం బాలెంల స్టేజ్ సమీపంలో ఇవాళ సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. చికెన్ సప్లై డీసీఎం ఓ పాదచారుడిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆయన బాలెంల గ్రామానికి చెందిన రిటైర్డ్ ఏఎస్ఐ హనుమంత్‌గా సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.