చిన్న సాయం.. మూగజీవుల ప్రాణాలకు రక్షణ

చిన్న సాయం.. మూగజీవుల ప్రాణాలకు రక్షణ

రోజు రోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. దీంతో వేడిని తట్టుకోలేక వీధి కుక్కలు నీడ కోసం కార్లు, పెద్ద వాహనాల కింద తలదాచుకుంటాయి. వాహనదారులు బండి స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి కింద గమనించండి.. లేదా చిన్నగా హారన్ కొట్టండి. అలాగే, మీ ఇంటి బయట చిన్న గిన్నెలో నీళ్లు ఉంచి మూగ జీవాల దాహన్ని తీర్చండి. మనం తీసుకునే ఈ చిన్న సాయం.. ఎన్నో మూగజీవుల ప్రాణాలను రక్షిస్తుంది.