ప్రణాళికలతో పంచాయతీలు అభివృద్ధి
SKLM: పక్కా ప్రణాళికలు తయారు చేయడం ద్వారానే పంచాయతీలు అభివృద్ధికి నోచుకుంటాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం ఎంపీడీఓ కార్యాలయంలో వార్డు సభ్యూలు, ఉపసర్పంచ్, గ్రామ కార్యదర్శులకు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. పంచాయతీల నిర్వహణలో అందరి పాత్ర అవసరమన్నారు.