'బియ్యం డెలివరీలో జాప్యం చేస్తే చర్యలు'

WNP: పాన్‌గల్ మండలంలోని మెహరూన్, మల్లికార్జున రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ కీమ్యనాయక్ గురువారం తనిఖీ చేశారు. ధాన్యం నిలువలు, ప్రాసెసింగ్ వివరాలను ఆయన పరిశీలించారు. రైతుల నుంచి సేకరించిన వరి ధాన్యాన్ని నిర్ణీత గడువులోపు మిల్లింగ్ చేసి బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని, డెలివరీలో జాప్యం జరిగితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అదనపు కలెక్టర్ హెచ్చరించారు.