మహిళలకు GOOD NEWS
TG: ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు ఇవాళ్టి నుంచి చీరల పంపిణీ ప్రారంభం కానుంది. HYD నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రెండు దశల్లో ఈ పథకం ద్వారా కోటి మంది మహిళలకు చీరలు అందించనున్నారు. ఈరోజు నుంచి DEC 9 వరకు గ్రామాల్లో, మార్చి 1 నుంచి 8 వరకు పట్టణాల్లో చీరలు పంపిణీ చేస్తారు.