రైల్వే గేట్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్

రైల్వే గేట్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్

కృష్ణా: మల్లాయిపాలెం గ్రామం రైల్వే గేట్ వద్ద ఎస్సై చంటిబాబు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌ను సోమవారం నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రత చర్యలలో భాగంగా వాహనదారులను ఆపి అల్కహాల్ మీటర్‌ ద్వారా పరీక్షించారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. ప్రజలప్రాణ భద్రత కోసమే ఈ తనిఖీలు చేస్తున్నామన్నారు.