నేడు ములుగుకు రానున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

MLG: ఆదివారం ములుగు జిల్లాకు మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, సీతక్క రానున్నట్లు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆధునిక మోడల్ బస్టాండ్ నిర్మాణానికి భూమి పూజ చేస్తారని చెప్పారు. ఆయనకు గట్టమ్మ దేవాలయం నుంచి లీలా గార్డెన్ వరకు భారీ బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలకనున్నారు.