'మై భారత్ యూత్' వాలంటీర్ల ఎంపిక కమిటీ సభ్యుడిగా ధోనికల నవీన్

'మై భారత్  యూత్' వాలంటీర్ల ఎంపిక కమిటీ సభ్యుడిగా ధోనికల నవీన్

JGL: నెహ్రు యువ కేంద్ర పథకం కింద 'మై భారత్ యూత్' వాలంటీర్ల ఎంపిక కోసం జిల్లా స్థాయి కమిటీ సభ్యుడిగా మెట్ పల్లి పట్టణానికి చెందిన ధోనికెల నవీన్‌ను భారత ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు 'మై భారత్' ఉప సంచాలకులు దేవేంద్ర వీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 'మై భారత్' కార్యక్రమాలు, NYC వాలంటీర్ల బాధ్యతల నిర్వహణలో నవీన్ మార్గదర్శకత్వంలో పనిచేస్తారని దేవేంద్ర వీఎస్ తెలిపారు.