అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

జగిత్యాల రూరల్ మండలం చలిగల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రూ. 14 లక్షలతో నిర్మించనున్న సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ. 19 లక్షలతో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.