గ్రామాల్లో పోలీసుల అవగాహన కార్యక్రమాలు

గ్రామాల్లో పోలీసుల అవగాహన కార్యక్రమాలు

TPT: జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామాలను సందర్శించి యువత, గ్రామస్థులకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, గంజాయి వంటి మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే శక్తి యాప్, డయల్ 112 సేవల గురించి కూడా వివరించారు.