నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
MNCL: తాండూర్ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా రేపు బోయపల్లి, చౌటపల్లి, తాండూరు,IB, కొత్తపల్లి, రేపల్లెవాడ, మాదారం, మాదారం 3 ఇంక్లైన్, కాసిపేట, చంద్రపల్లి తదితర గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని AE జాన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు సరఫరా నిలిపివేస్తామన్నారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని కోరారు.