నేడే జడ్పీ సర్వసభ్య సమావేశం
PLD: జడ్పీ సర్వసభ్య సమావేశం గుంటూరులోని జడ్పీ సమావేశ మందిరంలో నేడు 11గంటలకు జరగనుంది. జడ్పీ ఛైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జలవనరులు, వ్యవసాయ అనుబంధ, వైద్య, ఆరోగ్య, గ్రామీణ నీటి సరఫరా, మహిళాభివృద్ది, శిశు సంక్షేమలతో పాటు పలు శాఖల అభివృద్ది, భవిష్యత్తు కార్యచరణపై చర్చించనున్నారు. ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు.