డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నలుగురికి జైలు శిక్ష

KKD: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా కిర్లంపూడి పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో సోమవారం ఏడుగురు పట్టుబడ్డారు. వారిని ప్రత్తిపాడు కోర్టులో హాజరుపరచగా, నలుగురికి మూడు రోజుల జైలు శిక్ష విధించారు. ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారని సీఐ శ్రీనివాస్ తెలిపారు.