సమ్మె బాటలో పంచాయతీ కార్మికులు
VZM: ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోవడంతో పంచాయతీ కార్మికులు శుక్రవారం నుంచి సమ్మె బాట పట్టారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి అన్నారు. ఈమేరకు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పురిటిపెంట పంచాయతీ కార్మికులు సచివాలయం వద్ద నిరసన తెలియజేశారు. జీతాలు చెల్లించకపోవడంతో వారు అవస్థలు పడుతున్నారని అన్నారు.