పలాసలో కేంద్రీయ విద్యాలయానికి గ్రీన్ సిగ్నల్

పలాసలో కేంద్రీయ విద్యాలయానికి గ్రీన్ సిగ్నల్

SKLM: పలాస కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్య ఏడాదికి తరగతులు ప్రారంభం కానున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిందన్నారు. శ్రీకాకుళం ప్రాంతానికి ఎంతో కీలకమైన ఈ విద్యాసంస్థ ఏర్పాటుకు సహకరించిన పీఎం మోదీకి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.